హైదరాబాద్, మహానది న్యూస్, మే 05:

మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్( టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మెన్ లతో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులు(డీపీఆర్వో)లను ప్రతివాదులుగా చేర్చారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *